Team India: కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి దెబ్బ!

  • కోహ్లీ వరుస విజయాలకు ఇంగ్లండ్ బ్రేక్
  • కెప్టెన్‌గా 8 ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయం
  • టెస్ట్ సిరీస్‌ను ఏం చేస్తుందో?

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా తొలిదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేను గెలుకున్న విరాట్ సేన.. తర్వాతి రెండు వన్డేల్లోనూ చతికిల పడింది. అంతేకాదు, ఈ రెంటింటిలోనూ ఒకే విధమైన ఆటతీరుతో పరాజయం పాలైంది.

వరుస విజయాల తర్వాత ఊపుమీదున్న భారత జట్టును ఇంగ్లండ్ నిలువరించింది. ఈ సిరీస్ ఓటమి కోహ్లీకి కెప్టెన్‌గా తొలి ఎదురుదెబ్బ. 2013 నుంచి కోహ్లీ సారథ్యంలో భారత్ 8 ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంది. జింబాబ్వే, శ్రీలంక (రెండుసార్లు), దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, విండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో కోహ్లీ అద్భుత విజయాలు సాధించాడు. ఇప్పుడీ విజయాల పరంపరకు ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. ఆగస్టు 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. టెస్టు సిరీస్‌నైనా దక్కించుకుని ప్రతీకారం తీర్చుకుంటుందో, లేదో వేచి చూడాల్సిందే. కాగా, కోహ్లీ సారథ్యంలో మొత్తం 52 వన్డేలు ఆడిన భారత్ 39 విజయాలు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News