Azaharuddin: నా మీద కాదు.. నీకు దమ్ముంటే ఆయనపై పోటీ చెయ్!: అంజన్ కుమార్‌కు అజారుద్దీన్ సవాల్

  • నా మీద కాదు, ఒవైసీపై పోటీ చేసి గెలువు
  • అజర్ వ్యాఖ్యలతో మరోమారు వేడి
  • పాతబస్తీలో మూడు దశాబ్దాలుగా తిరుగులేని మజ్లిస్

వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానంటూ హైదరాబాద్ కాంగ్రెస్‌లో వివాదం రేపిన అజారుద్దీన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ స్థానం తనదేనని, అక్కడ అజర్ ఎలా పోటీ చేస్తాడంటూ విరుచుకుపడిన అంజన్ కుమార్ యాదవ్‌కు అజర్ సవాలు విసిరారు. తనపై ఎగరడం కాదని, దమ్ముంటే హైదరాబాద్‌‌లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. దీంతో నగర కాంగ్రెస్ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి.

నిజానికి అజారుద్దీన్ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారే. ఈ కారణంగానే ఆయన ఆ స్థానంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఆ స్థానం తనదేనని చెబుతున్న అంజన్ కుమార్‌ హైదరాబాద్‌కు చెందినవారు కావడం గమనార్హం. పాతబస్తీలో గత మూడు దశాబ్దాలుగా మజ్లిస్‌కు తిరుగులేకుండా పోతోంది. అజారుద్దీన్ కూడా ఒవైసీ సామాజిక వర్గానికే చెందినవారు కావడం, క్రికెటర్‌గా చిరపరిచితులు కావడంతో రానున్న ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. ఒవైసీకి చెక్ చెప్పే వీలుంటుందని చెబుతున్నారు. అయితే, అజర్ మాత్రం సికింద్రాబాద్ నుంచే పోటీకి మొగ్గు చూపుతున్నారు.

Azaharuddin
Congress
Hyderabad
Anjan Kumar Yadav
  • Loading...

More Telugu News