Pawan Kalyan: పవన్ ‌కల్యాణ్‌‌ను ఎద్దేవా చేసిన మంత్రి గంటా

  • పవన్‌ తీరును చూసి జనం నవ్వుతున్నారు 
  • మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడని వ్యాఖ్య
  • మోదీ అంటే పవన్, జగన్‌లకు వణుకన్న గంటా

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు ఫైరయ్యారు. పవన్ మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఏదో చేయడానికి అన్నీ వదిలేసుకుని వచ్చానని పదేపదే చెబుతున్న పవన్ మాటలు ఉత్తవేనని అన్నారు. రైల్వే జోన్ కోసం టీడీపీ విశాఖలో దీక్ష చేస్తున్న సమయంలోనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని నిలదీశారు. మోదీని చూసి పవన్, జగన్ భయపడుతున్నారని అన్నారు.

కాగా, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని జ్ఞానాపురం రైల్వే గేటు వద్ద నిన్న రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు. నేటి ఉదయం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎన్జీవో నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.

Pawan Kalyan
Andhra Pradesh
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News