gvl narasimha rao: టీడీపీ పాపాల చిట్టా నా దగ్గర ఉంది.. పార్లమెంట్ వేదికగా బయటపెడతా: బీజేపీ నేత జీవీఎల్

  • టీడీపీకి కావాల్సింది కేవలం అవినీతి, అరాచకాలే 
  • టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ
  • ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రామాలాడుతున్నారు

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు 1500 రోజుల పరిపాలనలో ఏదో సాధించామన్నట్టుగా ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. టీడీపీ చెబుతున్న అబద్ధాలు, ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కనుకే విశ్వసనీయత లేని ఆ పార్టీని ప్రజలు భరించక తప్పడం లేదని విమర్శించారు.

టీడీపీకి కావాల్సింది కేవలం అవినీతి, అరాచకాలేనని ఆరోపించారు. టీడీపీ పాపాల చిట్టా తన దగ్గర ఉందని.. పార్లమెంట్ వేదికగా బయటపెడతానని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ అని, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ పార్టీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని, మరోవైపు ప్రత్యేక ప్యాకేజ్ నిధులు ఇవ్వాలని ఉత్తరాలు రాస్తున్నారని విమర్శించారు.

gvl narasimha rao
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News