Sujana Chowdary: అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతామని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పాం: సుజనా చౌదరి

  • కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతాం
  • ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పాం
  • ప్రజల ఆకాంక్షను చెప్పేందుకే అవిశ్వాసం పెడుతున్నాం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతామని, ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పామని అన్నారు. ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకే తప్ప, ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని అన్నారు.

ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదని స్వయంగా మోదీనే అన్నారని, దానిని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే బాగుంటుందని ప్రధాని మోదీతో విజయసాయి అన్నారే తప్ప, హోదా కావాలని కచ్చితంగా అడగడం లేదని అన్నారు.

Sujana Chowdary
modi
  • Loading...

More Telugu News