India: తొలి మ్యాచ్ లో తొలి వికెట్ దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్
- భారత్- శ్రీలంక జట్ల (అండర్ -19) మధ్య తొలి టెస్టు
- కొలంబో వేదికగా మ్యాచ్
- శ్రీలంకతో భారత్ కు 2 అనధికార టెస్టులు, 5 వన్డేలు
భారత్ తరపున శ్రీలంక జట్టుతో రెండు అనధికార టెస్టులు, ఐదు వన్డేలు ఆడేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అండర్ -19 జట్టులో మొదటిసారి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. భారత్ అండర్-19 జట్టుకు అనూజ్ రావత్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఈ మ్యాచ్ లో అర్జున్ తొలి వికెట్ దక్కించుకున్నాడు. భారత్ తరపున అర్జున్ తొలి వికెట్ సాధించాడు. అయితే, అనధికార టెస్టులు కనుక ఈ గణాంకాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకోదు. అర్జున్ వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ మూడో ఓవర్) లోని చివరి బంతిని కొట్టిన మిషారా (9) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటలో 32 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.