kcr: అవసరమైనప్పుడు మేమంతా ఒక్కటవుతాం: సబిత ఇంద్రారెడ్డి

  • కేసీఆర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో వంద మంది ఉన్నారు
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ భరతం పడతాం
  • నేను మహేశ్వరం నుంచే పోటీ చేస్తా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గత ఎన్నికలు భావోద్వేగంతో జరిగాయని... తెలంగాణలో ఏ పార్టీకి బలముందని చెప్పడానికి ఆ ఎన్నికలు ప్రామాణికం కాదని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ భరతం పడతామని చెప్పారు.

 కేసీఆర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో వంద మంది ఉన్నారని... అయితే, ఆయనలా గప్పాలు కొట్టడం మాత్రం తమకు రాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, టీఆర్ఎస్ లో అది ఏమాత్రం లేదని చెప్పారు. అవసరమైనప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఒక్కటవుతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. 

kcr
sabitha indra reddy
congress
TRS
  • Loading...

More Telugu News