butta renuka: బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలుస్తారు?: కేంద్ర మంత్రిని నిలదీసిన విజయసాయిరెడ్డి

  • రేపట్నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నుంచి బుట్టా రేణుకకు ఆహ్వానం
  • పార్టీ ఫిరాయించిన ఆమెను ఎలా పిలుస్తారంటూ విజయసాయి ప్రశ్న

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఎంపీ బుట్టా రేణుకను ఆహ్వానించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి, పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను సమావేశానికి ఎలా పిలుస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ను ఆయన నిలదీశారు.

ఆమెపై అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందని, తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండానే ఆమెను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీలు కలిసే ఈ పని చేశాయని విమర్శించారు. 

butta renuka
vijayasai reddy
  • Loading...

More Telugu News