Koratala Siva: డీవీవీ దానయ్య రెమ్యునరేషన్ ఇవ్వలేదనే వార్తలపై స్పందించిన దర్శకుడు కొరటాల శివ!

  • మాకు రావాల్సిన పారితోషికం మొత్తం ఇచ్చేశారు
  • రామానాయుడు తర్వాత అంత మనసున్న నిర్మాత దానయ్య
  • రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా భారీ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, కొరటాల శివతో పాటు హీరోయిన్ కైరా అద్వానీలకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలను దానయ్య కూడా ఖండించారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పూర్తి రెమ్యునరేషన్ చెల్లించేశామని ఆయన తెలిపారు.

దీనిపై తాజాగా కొరటాల శివ స్పందించారు. తనకు పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. సినిమా విడుదలకు ముందే తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం వచ్చిందని తెలిపారు. డీవీవీ దానయ్య గొప్ప వ్యక్తి అని, రామానాయుడు తర్వాత అంత మనసున్న నిర్మాతల్లో ఆయనొకరని చెప్పారు. ప్రస్తుతం దానయ్య మూడు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని... ఒకవేళ తమకు పారితోషికం చెల్లించకుంటే, ఆ సినిమాలను ఆయన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రెమ్యునరేష్ కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, వాటిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. 

Koratala Siva
remuneration
Bharath Ane Nenu
dvv danayya
  • Loading...

More Telugu News