mammootty: మమ్ముట్టిపై దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు!

  • మమ్ముట్టి అంటే నాకు చాలా ఇష్టం
  • 'పెనార్బు' సినిమాలో ఆయన నటన అద్భుతం
  • మమ్ముట్టి కాకుండా మరెవరు నటించినా ఓవర్ యాక్షన్ చేసుండేవారు

సూపర్ స్టార్ మమ్ముట్టి అంటే తనకు ఎంతో ఇష్టమని తమిళ దర్శకుడు మిస్కిన్ చెప్పారు. మమ్ముట్టి నటించిన 'పెరాన్బు' టీజర్ ను చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మిస్కిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మమ్ముట్టిపై తనకున్న అభిమానాన్ని చెప్పుకున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి కాకుండా మరెవరు నటించినా బాగుండేది కాదని... ఇదే పాత్రను మరొకరికి ఇస్తే, ఓవర్ యాక్షన్ చేసుండేవారని అన్నారు.

ఈ సినిమాలో ప్రేక్షకులు కేవలం మమ్ముట్టిని మాత్రమే చూస్తారని చెప్పారు. తాను యువకుడిగా ఉండి, మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే... ఆయనను తాను అత్యాచారం చేసి ఉండేవాడినని అన్నారు. తాను అసభ్యంగా మాట్లాడుతున్నానని ఎవరూ భావించవద్దని... మమ్ముట్టి నటన తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికే తాను ఈ విధంగా మాట్లాడానని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. మిస్కిన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ దర్శకుడు అయివుండి ఇలాంటి వ్యాఖ్యలేంటని ప్రశ్నిస్తున్నారు. మమ్ముట్టిపై ఉన్న గౌరవాన్ని ఇలా చూపించడం ఎంత వరకు సబబని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఓ సూపర్ స్టార్ ను మెచ్చుకోవడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని మరికొందరు సలహా ఇచ్చారు. 

mammootty
mysskin
rape
peranbu
  • Loading...

More Telugu News