kishan reddy: ఛలో ప్రగతి భవన్ కు బీజేపీ పిలుపు.. కిషన్ రెడ్డి హౌస్ అరెస్ట్!

  • స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడంపై బీజేపీ ఆగ్రహం
  • నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్
  • ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

స్వామి పరిపూర్ణానందను ఆరు నెలల పాటు హైదరాబాదు నుంచి బహిష్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ... ఛలో ప్రగతి భవన్ కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు.

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావులను హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. మరోవైపు, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను కూడా ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

kishan reddy
house arrest
pragathi bhavan
swamy paripoornananda
  • Loading...

More Telugu News