Kesineni Nani: 5 రూపాయలకే భోజనం.. చాలా బాగుంది: కేశినేని నాని

  • పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్ లు
  • ఇది గర్వించదగ్గ విషయం
  • అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన కేశినేని నాని

పేదల ఆకలి తీర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేశారని... ఇది చాలా గర్వించదగ్గ విషయమని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలోని 28వ డివిజన్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆయన పరిశీలించారు. అక్కడే భోంచేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ ల ద్వారా కేవలం రూ. 5కే కడుపునిండా, రుచికరమైన భోజనం దొరుకుతోందని అన్నారు. భోజనం చాలా బాగుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా, అన్న క్యాంటీన్ ఎదుట ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, కార్పొరేటర్లు హరనాథ్, యేదుపాటి రామయ్య, అల్లు వెంకట జయలక్ష్మి, కె.వెంకటేశ్వరరావు, షేక్ హబిబుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Kesineni Nani
anna canteen
  • Loading...

More Telugu News