Chandrababu: బ్రేకింగ్ న్యూస్... మహా సంప్రోక్షణలోనూ భక్తులకు దర్శనాలు: ఆదేశాలిచ్చిన చంద్రబాబు

  • గతంలో అవలంబించిన విధానాన్నే పాటించండి
  • పరిమిత సంఖ్యలో అయినా భక్తులను పంపాల్సిందే
  • ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు

గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఎటువంటి విధానాలను పాటించారో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని, ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని ఆదేశించారు.

ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే మహా సంప్రోక్షణ క్రతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు ఆయన సూచించారు. తిరుమలలో భక్తులు రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూసేలా చేయవద్దని ఆయన తెలిపారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

Chandrababu
Tirumala
Tirupati
TTD
Lord Venkateshwara
Maha Samprokshana
  • Loading...

More Telugu News