CBI: రూ.43 కోట్ల క్రికెట్ బోర్డు స్కామ్‌లో కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిపై చార్జిషీట్
- రూ.112 కోట్లు ఇచ్చిన బీసీసీఐ
- రూ.43 కోట్లు దుర్వినియోగం
- ఫరూక్ అబ్దుల్లా సహా మరో ముగ్గురిపై చార్జిషీట్
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై సీబీఐ సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన రూ.43 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అబ్దుల్లా సహా మరో ముగ్గురిపై శ్రీనగర్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది.
2002, 2011లో జమ్ముకశ్మీర్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.112 కోట్లు ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన ఈ నిధుల్లో రూ.43 కోట్లను బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నేరపూరిత కుట్ర, నేరపూరిత ఉల్లంఘన వంటి అభియోగాలు నమోదు చేసిన సీబీఐ.. జేకేసీఏ అప్పటి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలీం ఖాన్, అప్పటి ట్రెజరర్ అశాన్ అహ్మద్ మీర్జా, జమ్ముకశ్మీర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బషీర్ అహ్మద్‌లపై చార్జిషీటు దాఖలు చేసింది.