azarduddin: అజారుద్దీన్ కు సవాల్ విసిరిన అంజన్ కుమార్ యాదవ్

  • సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన అజార్
  • దమ్ముంటే పోటీ చేయాలన్న అంజన్ కుమార్ యాదవ్
  • సికింద్రాబాద్ స్థానాన్ని వదలబోనంటూ ఆగ్రహం

ఈరోజు హైదరాబాదులో జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా ముగిసింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని అజార్ కు సవాల్ విసిరారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని తాను వీడబోనని ఆయన స్పష్టం చేశారు.

 అంజన్ ను సముదాయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా... ఆయన తగ్గలేదు. దీంతో, అంజన్ మాట్లాడుతుండగానే సమావేశం నుంచి సీనియర్ నేత వి.హనుమంతరావు వెళ్లిపోయారు. మరోవైపు ఈ సమావేశానికి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ లు గైర్హాజరయ్యారు. వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

azarduddin
Anjan Kumar Yadav
secunderabad
paliament
constituency
  • Loading...

More Telugu News