religion: మతం మార్చుకునేవారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు: బీజేపీ ఎమ్మెల్యే దినేష్

  • ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
  • ఈ చట్టం అమలైతే మతమార్పిడులు చాలా వరకు ఆగిపోతాయి
  • చట్టాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నా

వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నేతలు అనునిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ బస్తర్ ఎమ్మెల్యే దినేష్ కశ్యప్ కూడా ఈ జాబితాలో చేరారు. జగదల్పూర్ లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, మతమార్పిడి పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. మతం మార్చుకునేవారికి, ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలను కల్పించకూడదని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలని అన్నారు.

 ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, దీన్ని అమలు చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే, మతమార్పిడులు చాలా వరకు ఆగిపోతాయని అన్నారు. వారం క్రితం జార్ఖండ్ లో మత స్వేచ్ఛ చట్టం కింద 16 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దుంకా జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో మతమార్పిడులు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం గత ఏడాది ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News