kumaraswamy: కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామిపై బీజేపీ సెటైర్లు!

  • మన దేశం ఎంతో మంది గొప్ప నటులను సృష్టించింది
  • మనకు మరో దిగ్గజ నటుడు కుమారస్వామి ఉన్నారు
  • తన నటనతో ప్రజలను నిత్యం ఫూల్స్ ని చేస్తున్నారు

జేడీఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. మీ సోదరుడు సీఎం అయ్యారని మీరంతా సంతోష పడుతున్నారని... కానీ తాను మాత్రం సంతోషంగా లేనని ఆయన అన్నారు. లోకాన్ని కాపాడటం కోసం పరమశివుడు తన గొంతులో గరళాన్ని నింపుకున్నట్టు... తాను కూడా విషం తాగుతున్నానని కంటతడి పెట్టారు.

దీనిపై కర్ణాటక బీజేపీ సెటైర్లు వేసింది. 'అండ్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు' అంటూ ట్విట్టర్లో శీర్షిక పెట్టి, కామెంట్ చేసింది. 'మన దేశం ఎంతో మంది గొప్ప నటులను సృష్టించింది. వీరంతా తమ గొప్ప నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక్కడ మనకు మరో దిగ్గజ నటుడు కుమారస్వామి ఉన్నారు. తన నటనా చాతుర్యంతో ప్రజలను నిత్యం ఫూల్స్ ని చేస్తున్నారు' అంటూ ట్వీట్ చేసింది.

kumaraswamy
bjp
tweet
  • Error fetching data: Network response was not ok

More Telugu News