Adilabad District: ఏడు నెలల గర్భిణిగా ఉండి శిశువు కిడ్నాప్... కీలక మలుపు తిరిగిన పుష్పలత కేసు!

  • 4న రిమ్స్ నుంచి శిశువు కిడ్నాప్
  • ఒక్క రోజులోనే పట్టేసిన పోలీసులు
  • ఆమె బుకాయించిందని గుర్తించిన పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ నుంచి ఆరు రోజుల బిడ్డను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆపై గంటల వ్యవధిలో పట్టుబడ్డ పుష్పలత కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు, తనకు పిల్లలు లేనందునే కిడ్నాప్ చేశానని చెప్పడంతో, పోలీసులు ఆ మాటలు నమ్మారు. తీరా రిమాండ్ కు తరలించే ముందు వైద్య పరీక్షలు చేయించగా, ఆమె 7 నెలల గర్భవతిగా ఉందని తేలింది.

దీంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారిస్తే, అసలు కథ చెప్పింది. తన బంధువుల్లో ఒకరికి పిల్లలు లేరని, వారికి రూ. 50 వేలకు శిశువును అమ్మేందుకు తీసుకెళ్లానని చెప్పింది. ఆపై రిమాండ్ కు వెళ్లిన తరువాత ఆమెకు గర్భస్రావం జరగడంతో, రిమ్స్ లో చేర్పించి చికిత్సను అందిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, 4వ తేదీన రిమ్స్ లో పుష్పలత ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకు వెళుతుండగా, ఆ దృశ్యాలు సీసీటీవీలో నమోదైన సంగతి తెలిసిందే. ఆపై ఒక్కరోజులోనే పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Adilabad District
RIMS
Kidnap
Pushpalata
  • Loading...

More Telugu News