Donald Trump: మనసులో మాట బయటపెట్టిన అమెరికా అధ్యక్షుడు!

  • 2020లోనూ నేనే అధ్యక్షుడిని
  • అమెరికన్లు అందరూ నన్నే కోరుకుంటున్నారు
  • డెమొక్రటిక్ పార్టీలో నన్ను ఢీకొట్టే వారే లేరు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు తనపై అచంచల విశ్వాసం ఉందని అన్నారు. 2020 ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఎన్నికవుతానన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రతీ ఒక్కరు నన్ను కోరుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో తనను ఢీకొట్టగలిగే వ్యక్తే లేరని తేల్చి చెప్పారు. ‘‘నాకు వారందరూ తెలుసు. కానీ నన్ను ఢీకొట్టగలిగే వ్యక్తి నాకు కనిపించడం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ నిర్ణయాలపై స్వదేశంతోపాటు విదేశాల్లోనూ నిరసన వెల్లువెత్తుతున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ లండన్ పర్యటనపైనా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, ట్రంప్ గతంలోనూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ పార్టీ చరిత్రలోనే తాను అత్యంత పాప్యులర్ వ్యక్తినని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయంలో అబ్రహం లింకన్‌ను కూడా అధిగమించానని పేర్కొన్నారు.

Donald Trump
America
President
  • Loading...

More Telugu News