Uttar Pradesh: గోవధను అడ్డుకోవడంలో విఫలం.. తనపై తానే ఫిర్యాదు చేసుకున్న పోలీసు అధికారి!

  • నిందితులను పట్టుకోవడంలో విఫలం
  • తనపై తానే కేసు నమోదు చేసుకున్న ఎస్‌హెచ్‌వో
  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన

విధి నిర్వహణలో విఫలమైన ఓ పోలీసు అధికారి తనపై తానే కేసు నమోదు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. చతారీ గ్రామానికి చెందిన కొందరు గోవధకు పాల్పడుతున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) రాజేంద్ర త్యాగికి సమాచారం అందింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన వెంటనే రంగంలోకి దిగారు. తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, నిందితులను పట్టుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలం కావడంతో వారు తప్పించుకుపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం, నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్‌హెచ్‌వో దానికి బాధ్యత తీసుకున్నారు. గోవధను అడ్డుకోవడంలో విఫలమయ్యానంటూ తనతోపాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసుకున్నారు.

Uttar Pradesh
SHO
Cow Slaughter
  • Loading...

More Telugu News