Srikakulam District: ఇసుకను తోడేందుకు వెళ్లి.. ‘వంశధార’లో చిక్కుకుపోయిన కూలీలు

  • ఇసుక కోసం నదిలోకి వెళ్లిన కూలీలు
  • ఒక్కసారిగా ఉప్పొంగిన వరద
  • చిక్కుకుపోయి ఆర్తనాదాలు

ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు వంశధార నదిలో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఇసుకు ర్యాంప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 53 మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇసుక కోసం వీరు లోపలికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగింది. దీంతో వీరంతా నదిలో చిక్కుకుపోయారు.

20 లారీలు, 2 జేసీబీలలో ర్యాంప్ కు వెళ్లిన వీరు లోపల చిక్కుకుపోయి సాయం కోసం కేకలు వేశారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారిని ఒడ్డుకు తీసుకు వచ్చేందుకు బోట్లను సిద్ధం చేసినట్టు డీఎస్పీ భీమారావు తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

Srikakulam District
Vamsadhara
River
Sand
  • Loading...

More Telugu News