Telugudesam mp: జగన్ తన తీరు మార్చుకోకపోతే చట్టపరంగా స్పందిస్తా: మురళీమోహన్

  • ఇసుక దందాలతో ఎలాంటి సంబంధం లేదు
  • నిందితుడు జగన్ కు నాపై ఆరోపణలు చేసే అర్హత లేదు
  • అలిఫ్ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే మాకేంటి సంబంధం?

జగన్ తన తీరు మార్చుకోకపోతే చట్టపరంగా స్పందిస్తానని టీడీపీ ఎంపీ మురళీమోహన్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇసుక దందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దొంగబుద్ధులు తమకు లేవని, రాజమండ్రిలో తాను కట్టుకున్న ఇంటికి ఇసుకను మార్కెట్ రేట్ ప్రకారమే కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు తనపై ఆరోపణలు చేసే అర్హత లేదని అన్నారు. అలిఫ్ సంస్థకు భూ కేటాయింపు వ్యవహారంలో తన కుటుంబసభ్యులకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే తమపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. 

Telugudesam mp
murali mohan
rupa
  • Loading...

More Telugu News