Andhra Pradesh: ఏపీలో ఎంపీలందరూ కోటీశ్వరులే: సీపీఐ నేత రామకృష్ణ
- ఏపీని రెండు కుటుంబాలే శాసిస్తున్నాయి
- పవన్ పై టీడీపీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
- మా ఉద్యమాల్లో పాల్గొనమని పవన్ కు మోదీ చెబుతారా?
ఏపీని రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని, ఇక్కడి ఎంపీలందరూ కోటీశ్వరులేనని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ చెప్పినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కమ్యూనిస్టుల ఉద్యమాల్లో పాల్గొనమని పవన్ కు మోదీ చెబుతారా? ఈ ప్రశ్నకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీని గద్దె దించకపోతే ప్రజల భవిష్యత్తు నాశనమవుతుంది: సీతారాం ఏచూరి
తెలంగాణలో బహుజన రాజ్యాధికారం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన బీఎల్ ఎఫ్ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ, బహుజనులపై ఆర్థిక, రాజకీయ దోపిడీ జరుగుతోందని, కేంద్రంలో బీజేపీని గద్దె దించకపోతే ప్రజల భవిష్యత్తు నాశనమవుతుందని ఆరోపించారు. మోదీ, రాహుల్ పేరిట చర్చలు జరుగుతున్నాయని, తమకు కావాల్సింది నేతలు కాదని, దేశానికి ప్రత్యామ్నాయమని అన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి పార్టీలకు విరాళాలిచ్చే విధానాన్ని రద్దు చేయాలని, బీజేపీకి అనుకూలంగా ఓటు పడేలా ఈవీఎంల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.