Jarkhand: మరో మాస్ సూసైడ్... జార్ఖండ్ లో ఆరుగురి ఆత్మహత్య!

  • హజారీబాగ్ ప్రాంతంలో ఘటన
  • ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
  • అప్పులు పెరిగిపోయాయని సూసైడ్ నోట్

న్యూఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను మరువక ముందే జార్ఖండ్ లోని హజారీబాగ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులు పెరిగిన కారణంతో తామంతా చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసిన ఓ కుటుంబంలోని ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు.

వీరిని మహావీర్ మహేశ్వరి (70, ఆయన భార్య కిరణ్ మహేశ్వరి (65), వారి కుమారుడు నరేష్ అగర్వాల్ (40), కోడలు పృథ్వీ అగర్వాల్ (38), మనవడు అమన్ (8), మనవరాలు అంజలి (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ కుటుంబానికి ఓ డ్రై ఫ్రూట్స్ షాప్ ఉందని, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారని, కుటుంబంలోనూ విభేదాలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం.

Jarkhand
Mass Sucide
Hazaribagh
Police
  • Loading...

More Telugu News