East Godavari District: పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు!: తూర్పు గోదావరి కలెక్టర్ మిశ్రా

  • నిన్న పడవ ప్రమాదం
  • గల్లంతైన విద్యార్థులు
  • మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

నిన్న తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకలేదని కలెక్టర్ మిశ్రా వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, సెర్చ్ ఆపరేషన్ లో ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఈదురుగాలులతో పాటు సముద్రంలో పోటు అధికంగా ఉండటంతో సహాయక బృందాలు మృతదేహాలను గాలించడం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు.

భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని, మృతదేహాల వెలికితీతకు 19 బృందాలు శ్రమిస్తుండగా, నేవీ సాయాన్ని కోరామని, మధ్యాహ్నానికి విశాఖ నుంచి నేవీ సిబ్బంది వస్తుందని చెప్పారు. కాగా, పశువుల్లంక వద్ద సహాయక చర్యలను కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

East Godavari District
Boat
Capasize
Godavari
River
  • Loading...

More Telugu News