Aditi Rao Hydari: 'ఇంకెప్పుడూ ఎవరినీ ఇలా తాకవద్దు అంకుల్' అంటూ హెచ్చరించాను!: హీరోయిన్ అదితీ రావ్ హైదరి

  • తెలుగులో 'సమ్మోహనం'లో నటించిన అదితి
  • స్కూలుకు రైల్లో వెళుతుంటే అసభ్యంగా తాకిన వ్యక్తి
  • అప్పుడే గట్టిగా హెచ్చరించానన్న అదితి

తొలుత 'పద్మావత్'లో, ఆపై 'సమ్మోహనం'లో తన అభినయంతో అలరించిన అదితీ రావ్ హైదరీ, చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, చిన్న తనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. తన కుటుంబ సభ్యులు తనకెంతో స్వతంత్రాన్ని ఇచ్చేవాళ్లని చెప్పిన అదితీ, తనకు ఒకే ఒక్క సంఘటన ఎదురైందని చెప్పింది.

చిన్న వయసులో తాను స్కూలుకు రైల్లో వెళ్లేదాన్నని గుర్తు చేసుకున్న ఆమె, ఓ అంకుల్ తనను బ్యాడ్ గా టచ్ చేస్తూ వెళ్లాడని, అతని వైపు డర్టీగా చూస్తూ, 'ఇంకెప్పుడూ ఎవరినీ ఇలా తాకవద్దు అంకుల్' అని చెబుతూ హెచ్చరించి వెళ్లిపోయానని అంది. ఆపై తనకు ఎక్కడా ఎలాంటి సమస్యలూ ఎదురు కాలేదని చెప్పింది. ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాన్ని ఇంట్లోవాళ్లే తమ అమ్మాయిలకు చెప్పాలని, ఈ విషయంలో తనను తల్లిదండ్రులు చాలా ప్రొటెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది.

లైంగిక వేధింపులపై మాట్లాడితే, అవకాశాలు తగ్గుతాయన్న వాతావరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉందని, పరిశ్రమలో హీరోయిన్లను వస్తువులా కాకుండా కళాకారులుగా చూస్తే ఈ పరిస్థితి మారుతుందని చెప్పిందీ అందాల భామ.

  • Error fetching data: Network response was not ok

More Telugu News