India: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ లో ఘోర పరాభావం... 86 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్!

  • 322 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • 236 పరుగులకు పరిమితమైన ఇండియా
  • 1-1తో సిరీస్ సమం

క్రికెట్ కు పుట్టినిల్లుగా పేరున్న లండన్ లోని లార్డ్స్ మైదానంలో భారత్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. తొలుత బౌలింగ్ లో విఫలమై భారీగా పరుగులను సమర్పించుకున్న టీమిండియా, ఆపై బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసి 322 పరుగుల భారీ స్కోరును ఇంగ్లండ్ సాధించగా, భారత ఆటగాళ్లు 236 పరుగులకు పరిమితమై, 86 పరుగుల తేడాతో ఓడిపోయారు.

 దీంతో మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 113, మోర్గాన్ 51, విల్లే 50 పరుగులతో రాణించారు. భారత ఆటగాళ్లలో కోహ్లీ 45, రైనా 46 మినహా మరెవరూ రాణించలేదు. ఈ సిరీస్ లో ఆఖరిదైన మూడో మ్యాచ్ లీడ్స్ మైదానంలో 17వ తేదీన జరగనుంది. ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే భారత జట్టు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ అయ్యే అవకాశం ఉండగా, రెండో మ్యాచ్ ఓడిపోవడంతో ఆ అవకాశం ఇప్పుడు కోల్పోయింది. 

India
England
Lords
Cricket
  • Loading...

More Telugu News