East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో పడవ బోల్తా దుర్ఘటనపై చంద్రబాబు, ర‌ఘువీరారెడ్డి దిగ్భ్రాంతి

  • ఇప్పటివరకు 26 మందిని ఒడ్డుకు చేర్చిన స్థానికులు
  • ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
  • గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో సుమారు 30 మంది ప్రయాణికులతో వెళుతోన్న పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు ఘటనాస్థలికి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ శాఖ అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పంపింది.

ఈ ఘటనపై స్పందించిన ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నట్లు ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

కాగా, మొండిరేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు పడవ తగిలి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు స్థానికులు  26 మందిని ఒడ్డుకు చేర్చారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.   

  • Loading...

More Telugu News