renu desai: కాబోయే భర్తతో కలసి.. మరో ఫొటో పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

  • పిల్లలు, కాబోయే భర్తతో కలసి అమెరికాలో పర్యటిస్తున్న రేణుదేశాయ్
  • కాబోయే భర్త ముఖం కనపడకుండా మరో ఫొటో
  • ఫొటో తీసింది అకీరా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే తన కాబోయే భర్త వివరాలను మాత్రం ఆమె గోప్యంగా ఉంచుతున్నారు. సోషల్ మీడియలో ఫొటోలు పెడుతున్నా... కాబోయే భర్త ముఖం మాత్రం స్పష్టంగా కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా కాబోయే భర్త, పిల్లలతో కలసి ఆమె అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. వివాహానికి ముందు వీరంతా ట్రిప్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మరో ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో ఆమె ముఖం క్లియర్ గా ఉండగా... ఆమె కాబోయే భర్త మాత్రం అటువైపు తిరిగి ఉన్నారు. అదికూడా ఆయన భుజం వరకే కనిపిస్తోంది. ఈ ఫొటోను అకీరా తీసినట్టు ఆమె తెలిపారు.

renu desai
husband
  • Loading...

More Telugu News