kamal: కమల్ తో పోటీపడుతోన్న నయనతార!

  • నయనతార ప్రధాన పాత్రగా 'కొలమావు కోకిల'
  • కమల్ కథానాయకుడిగా 'విశ్వరూపం 2'
  • ఆగస్టు 10వ తేదీన భారీస్థాయి విడుదల     

సినిమా సినిమాకి నయనతార క్రేజ్ పెరుగుతూ పోతోంది. కొత్తదనానికి .. నటనకి అవకాశమున్న పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే ఆమె ఈ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకోగలిగింది. అలాంటి నయనతార తాజా చిత్రంగా .. ఆమెనే ప్రధానపాత్రగా 'కొలమావు కోకిల' రూపొందింది. ఈ సినిమాలో డ్రగ్స్ అమ్మే యువతిగా నయనతార కనిపిస్తుంది. నెల్సన్ దర్శకత్వంలో .. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.

అదే రోజున కమలహాసన్ 'విశ్వరూపం 2' సినిమా కూడా థియేటర్లకు రానుంది. తమిళనాట కమల్ కి గల క్రేజ్ తెలియంది కాదు .. బడ్జెట్ పరంగా భారీతనం కలిగినదిగా 'విశ్వరూపం 2' సినిమా కనిపిస్తుంది. 'కొలమావు కోకిల' సినిమాను నిర్మించింది లైకా ప్రొడక్షన్స్ వారే అయినా, కథాకథనాల్లోని కొత్తదనమే ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆ బలమే 'విశ్వరూపం 2' తో పోటీ పడటానికి కారణమని చెప్పుకుంటున్నారు.       

kamal
nayanatara
  • Loading...

More Telugu News