kalyan dev: మాస్ మసాలా కథతో కల్యాణ్ దేవ్ రెండో సినిమా?

  • 'విజేత'కి మంచి ఆదరణ 
  • మార్కులు కొట్టేసిన కల్యాణ్ దేవ్ 
  • మరో సినిమాకి సన్నాహాలు  

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన 'విజేత' .. మొన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసినవాళ్లు లుక్స్ పరంగా .. నటన పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు ఇచ్చారు. తొలి సినిమాతోనే ఇటు యూత్ కి .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కల్యాణ్ దేవ్ చేరువైపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన రెండవ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? దర్శకుడు ఎవరు? కథా వస్తువు ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరి మనసుల్లో తలెత్తుతోంది.

 కల్యాణ్ దేవ్ తన రెండవ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం లేదనేది ఫిల్మ్ నగర్ టాక్. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన రెండవ సినిమా కథ వుండనుందని చెబుతున్నారు. మాస్ మసాలాతో కూడిన కథాంశం ఆయన కోసం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు ఎవరు? అనే విషయంతో పాటు ఇతర వివరాలను పది రోజుల్లో వెల్లడించడానికి సిద్ధమవుతున్నారట.      

kalyan dev
  • Loading...

More Telugu News