adire abhi: నేను ప్రత్యక్షంగా చూశాను .. అదే రాజమౌళి గొప్పతనం: అదిరే అభి

  • రాజమౌళి పద్ధతి ప్రత్యేకం 
  • అన్నీ దగ్గరుండి చూసుకుంటారు
  • అందరి పేర్లు ఆయనకి గుర్తే

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో అదిరే అభి ఒకరు. మొదటి నుంచి దర్శకత్వం పట్ల ఆసక్తి వున్న ఆయన, 'బాహుబలి 2' టీమ్ అనుమతితో ఆ సినిమా షూటింగును చాలా దగ్గరగా చూశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాలను పంచుకున్నాడు.

"సెట్లో రాజమౌళి ప్రతి విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. అన్ని విషయాలను ఆయన దగ్గరుండి పరిశీలిస్తుంటారు. ఆయనకి సెట్ అసిస్టెంట్ నుంచి కాస్ట్యూమ్ అసిస్టెంట్ వరకూ పేర్లతో సహా తెలుసు. అంతమందిలో ప్రతి ఒక్కరి పేరును గుర్తుపెట్టుకుని పిలుస్తారాయన. ప్రొడక్షన్లో టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా ఆయనకి గుర్తే. ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో అది ప్రత్యక్షంగా చూసుకుంటారుగానీ .. దాదాపు ఆ పనిని వేరే వారికి అప్పగించరు. ఆయనకి గుర్తుచేయాలనుకోవడం ఎంత అమాయకత్వమవుతుందో నేను ప్రత్యక్షంగా చూశాను" అని చెప్పుకొచ్చాడు.   

adire abhi
  • Loading...

More Telugu News