Chandrababu: 1983లో ఈనాడు చెప్పింది.. ఇప్పుడు జాతీయ పత్రికలన్నీ చెప్పాయి!: నారా లోకేష్

  • 'తెలుగుదేశం సూపర్ హిట్' అని అప్పట్లో ఈనాడు ప్రచురించింది
  • అన్న క్యాంటీన్లు సూపర్ హిట్ అని ఇప్పుడు జాతీయ పత్రికలన్నీ ప్రచురించాయి
  • చంద్రబాబు కృషికి ఇదొక నిదర్శనం

1983లో తెలుగుదేశం ఎన్నికల్లో నెగ్గినప్పుడు... 'తెలుగుదేశం సూపర్ హిట్' అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిందని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అన్న క్యాంటీన్ల' గురించి జాతీయ పత్రికలన్నీ అదే రీతిలో కథనాలను ప్రచురించాయని తెలిపారు. 'అన్న క్యాంటీన్స్ సూపర్ హిట్' అంటూ నిన్న అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమని చెప్పారు. దీనికి తోడుగా మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఐబీటీ, బిజినెస్ స్టాండర్డ్, ఏఎన్ఐ, డెక్కన్ క్రానికల్ తదితర పత్రికలతో పాటు ఓ తమిళ పత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించిన పేపర్ కటింగ్ లను ఆయన అప్ లోడ్ చేశారు.

Chandrababu
Nara Lokesh
eenadu
  • Error fetching data: Network response was not ok

More Telugu News