Amit shah: రామోజీరావుతో బీజేపీ చీఫ్ అమిత్ షా భేటీ

  • ‘షా సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా భేటీ
  • ప్రభుత్వ పథకాలపై చర్చ
  • వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌తోనూ భేటీ

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా ఈనాడు అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. ‘షా సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా రామోజీతో భేటీ అయిన షా వివిధ ప్రభుత్వ పథకాలపై చర్చించారు. గత నాలుగేళ్లలో బీజేపీ సాధించిన అభివృద్ధిపైనా మాట్లాడారు. రామోజీతో భేటీ అనంతరం ఒలింపియన్ సైనా నెహ్వాల్‌ను షా కలిశారు. వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోనూ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తిరిగి గద్దెనెక్కించేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అమిత్ షా సూచించారు.

Amit shah
Eenadu
Ramoji Rao
Hyderabad
  • Loading...

More Telugu News