nuzividu: నూజివీడు టీడీపీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • నూజివీడు టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
  • విభేదాలు వీడి, కలిసికట్టుగా పని చేయాలని హెచ్చరిక
  • 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపు

కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వారి మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆదేశించారు. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు.

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, గ్రామదర్శిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం, టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మీడియాతో మాట్లాడుతూ, నూజివీడులో నేతల మధ్య ఉన్న విభేదాలు నిజమేనని, సీఎం ఆదేశాల మేరకు తామందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. తనకు తెలియకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ ని నియమించిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు.

nuzividu
Chandrababu
  • Loading...

More Telugu News