mangalagiri: మంగళగిరి ఎయిమ్స్ గురించి ఏపీకి తీపి కబురు చెప్పిన కేంద్ర మంత్రి నడ్డా!

- అనుకున్న గడువు కన్నా ముందుగానే ఎయిమ్స్ ను పూర్తి చేస్తాం
- ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తాం
- 2019 జనవరి నాటికి ఓపీ బ్లాక్ అందుబాటులోకి వస్తుంది
మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ ను గడువుకంటే ముందుగానే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ను నెలకొల్పారని... రూ. 1618 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆగస్ట్ నెలలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామని, మెరుగైన ఫ్యాకల్టీని అందిస్తామని తెలిపారు. 2019 జనవరి నాటికి ఔట్ పేషెంట్ బ్లాక్ ను సిద్ధం చేస్తామని చెప్పారు.



