Chandrababu: బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

  • నగదు డిపాజిట్లపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు
  • నగదు దొరకక ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు
  • కొన్ని ప్రాంతాలను మాత్రమే బ్యాంకర్లు పట్టించుకుంటున్నారు

బ్యాంకుల పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో బ్యాంకులు నమ్మకాన్ని నిలపాలని... వారిని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ నగదు కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడం కూడా కష్టమవుతోందని అన్నారు. బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నారని...అన్ని ప్రాంతాలనూ పట్టించుకోవాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. 

Chandrababu
bankers
  • Loading...

More Telugu News