Jabardast: అమ్మాయిగా అలరించిన 'జబర్దస్త్' హరి పోలీసుల అదుపులో... ఎర్రచందనం అమ్మిన డబ్బుతో 'శంభో శంకర'కు ఫైనాన్స్!

  • హరిని విచారిస్తున్న పోలీసులు
  • పక్కా ఆధారాలు ఉన్నాయంటున్న అధికారులు
  • పలు స్కిట్లలో అలరించిన హరి

 తెలుగు లోగిళ్లలో పేరు తెచ్చుకున్న కామెడీ స్కిట్ షో 'జబర్దస్త్' లో నటించిన ఓ నటుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లు కూడగట్టాడని, తోటి క్యారెక్టర్ ఆర్టిస్టు నటించిన ఓ చిత్రానికి డబ్బుసాయం చేశాడని నిన్న వచ్చిన వార్తలు సినీ, టీవీ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని కలిగించాయి. నిన్న సదరు ఆర్టిస్టు పేరు బయటకు రాలేదు. ఆ వివరాలు నేడు బయటకు వచ్చాయి.

'జబర్దస్త్'లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. షకలక శంకర్ నటించిన తాజా చిత్రం 'శంభో శంకర'కు అవసరమైన ఫైనాన్స్ ను కూడా హరి అందించాడట. ఇతనిపై సుమారు 20 కేసులున్నాయని, తిరుపతికి చెందిన హరి నేరాలపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Jabardast
Hari
Arrest
Red Sandel
Police
  • Loading...

More Telugu News