Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంట కిరణ్ కుమార్ రెడ్డి.. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు!

  • అప్పట్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
  • ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా రికార్డు
  • నేడు రాహుల్ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లోకి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టినా, ప్రజల ఆదరణను పొందలేకపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాలుగేళ్ల తరువాత నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లగా, ఆ సమయంలో బయటే ఉన్న రాహుల్, ఆయన్ను ఆప్యాయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు. ప్రస్తుతం వీరిద్దరూ లోపల చర్చల్లో ఉన్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనం పూర్తికానుండగా, పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Rahul Gandhi
Nallari Kirankumar Reddy
Congress
Andhra Pradesh
  • Loading...

More Telugu News