Kannada: కన్నడ స్టార్ హీరో యశ్ ను హత్య చేసేందుకు కుట్ర... సీసీబీ విచారణలో వెల్లడి!

  • యశ్ ను హత్య చేసేందుకు ప్లాన్
  • ఇంకా పని మొదలు పెట్టలేదన్న రవి
  • తాగిన మత్తులో వాగుడేనంటున్న పోలీసులు

ఓ కేసు విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన రౌడీ 'సైకిల్' రవిని విచారించిన సీసీబీ పోలీసులు విస్తుగొలిపే సమాచారాన్ని రాబట్టారు. కన్నడ స్టార్ హీరో యశ్ ను హత్య చేసేందుకు తాను కుట్రపన్నినట్టు రవి చెప్పాడు. ఈ విషయమై బెంగళూరుకు దగ్గరలో జరిగిన ఓ మందు పార్టీలో చర్చించామని, ప్లాన్ వేశామే తప్ప, ఇంకా కార్యాచరణను ప్రారంభించలేదని చెప్పాడు. నినీ నిర్మాత జయణ్ణతో ఓ వివాదం నేపథ్యంలో యశ్ పై సైకిల్ రవి పగను పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు.

కాగా, యశ్ హత్యకు జరుగుతున్న కుట్ర విషయాన్ని పోలీసులు చాలా చిన్న విషయంగా చెబుతుండటం గమనార్హం. ఇది పాత కథని, ఏదో తాగిన మత్తులో వాగిన వాగుడేనని, తాము రవి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.  

Kannada
Yash
Hero
Murder
Plan
Cicycle Ravi
Arrest
  • Loading...

More Telugu News