PV Sindhu: అదనంగా ఒక్క గజం స్థలం కూడా ఇవ్వం: పీవీ సింధుకు తేల్చి చెప్పిన టీఎస్ ప్రభుత్వం

  • గతంలోనే 1000 గజాల స్థలం, రూ. 5 కోట్ల నజరానా ఇచ్చిన ప్రభుత్వం
  • పక్కనే ఉన్న 398 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరిన సింధు
  • అదనంగా స్థలాన్ని కేటాయించలేమన్న ప్రభుత్వం

ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు అదనంగా మరో గజం స్థలాన్ని కూడా కేటాయించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధుకు... అప్పట్లోనే టీఎస్ ప్రభుత్వం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని భరణి లేఔట్ లో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. దీని విలువ దాదాపు రూ. 15 కోట్లు. దీనికి తోడు, రూ. 5 కోట్ల నజరానాను కూడా అందించింది.

తనకు ఇచ్చిన స్థలం పక్కనే ఉన్న 398 గజాల స్థలాన్ని కూడా తనకు కేటాయించాలంటూ కొన్నాళ్ల క్రితం ప్రభుత్వానికి ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఆమెకు స్థలంతో పాటు, నగదు బహుమతిని, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చిందని... ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల నుంచి ప్రయోజనాలను పొందిన ఆమెకు... అదనంగా స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం భావించినట్టు సమాచారం. 

PV Sindhu
land
Telangana
government
  • Loading...

More Telugu News