Train: రైల్లో స్లీపర్ క్లాస్ నుంచి ఏసీకి అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం!
- ఎగువ తరగతిలో ఖాళీలుంటే చాన్స్
- టికెట్ ధరలో వ్యత్యాసాన్ని చెల్లించాలి
- రైలు ఎక్కిన తరువాతైనా మార్చుకోవచ్చు
మీకు ఏదైనా రైల్లో స్లీపర్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ అయిందా? అయితే, దాన్ని త్రీ టైర్ లేదా టూ టైర్ ఏసీకి మార్చుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. పై తరగతిలో సీట్ల అందుబాటును బట్టి హయ్యర్ క్లాస్ లో అవకాశాన్ని కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో సదరు ప్రయాణికుడు దిగువ తరగతికి, ఎగువ తరగతికి మధ్య ధరలో ఉన్న వ్యత్యాసాన్ని చెప్పించాల్సి వుంటుంది. చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. టికెట్ కౌంటర్ లేదా రైలు ఎక్కిన తరువాత టీసీని సంప్రదించి ఎగువ తరగతికి అప్ గ్రేడ్ కావచ్చని అధికారులు వెల్లడించారు.