Singpore: హాలిడే కోసం సింగపూర్ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో అసభ్య ప్రవర్తన.. భారతీయ వైద్యుడి అరెస్ట్

  • స్విమ్మింగ్ పూల్‌లో మహిళలతో అసభ్య ప్రవర్తన
  • తాకరాని చోట తాకిన వైద్యుడు
  • బాధిత మహిళ ఫిర్యాదుతో అదుపులోకి

హాలిడే ట్రిప్ కోసం భార్య, కుమార్తెతో కలిసి సింగపూర్ వెళ్లిన భారతీయ వైద్యుడు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సింగపూర్‌లోని ఓ హోటల్‌లో దిగిన ఆయన అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో మరో నలుగురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. జగ్దీప్ సింగ్ అరోరా (46) భార్య, 11 ఏళ్ల కుమార్తెతో కలిసి రెండు వారాల ట్రిప్ కోసం సింగపూర్ చేరుకున్నారు. అక్కడి పాప్యులర్ టూరిస్ట్ స్పాట్ అయిన మెరీనా బే శాండ్ హోటల్ కాంప్లెక్స్‌లో దిగారు.

జూన్ 28న హోటల్‌లోని స్మిమ్మింగ్ పూల్‌లో దిగిన ఆయన అందులో ఉన్న నలుగురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని తాకరాని చోట తాకాడు. లుథియానాకు చెందిన 25 ఏళ్ల బాధితురాలు జగ్దీ‌ప్ స్విమ్మింగ్ పూల్‌లో తన వెనక రావడాన్ని గమనించింది. ఆ తర్వాత తనను అసభ్యంగా తాకడంతో  ఆమె నేరుగా వెళ్లి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

జగ్దీప్ ఇలానే మరో ముగ్గురు మహిళలను కూడా పూల్‌లో అసభ్యంగా తాకాడు. తొలి బాధితురాలి ఫిర్యాదు మేరకు జగ్దీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతడలా ప్రవర్తించడానికి ముందు మద్యం తాగినట్టు తేలింది. నిందితుడిని రెండు వారాల కస్టడీకి కోర్టు పంపించింది. కాగా, అతడిపై మోపిన మూడు అభియోగాల్లో ఏది రుజువైనా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన తర్వాత భర్త తీరుపై మనస్తాపం చెందిన ఆయన భార్య తిరిగి భారత్ వచ్చేసింది.

Singpore
Doctor
Women
Arrest
  • Loading...

More Telugu News