vakati karuna: పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఐఏఎస్ అధికారి కరుణ

  • సిద్దిపేటలో గురువారం రాత్రి ఘటన
  • డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
  • దెబ్బతిన్న కారు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వాకాటి కరుణ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రామగుండంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి సిద్దిపేట  జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో ప్రమాదాన్ని శంకించిన కారు డ్రైవర్ క్షణాల్లో కారును పక్కకు తిప్పారు. దీంతో పక్కన ఉన్న స్తంభాన్ని కారు ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని పోలీసులు తెలిపారు.

vakati karuna
Road Accident
Medak
IAS
  • Loading...

More Telugu News