Andhra Pradesh: ఏపీ ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై భేటీ.. ప్రధాన కమిషనర్ గా ఏకే జైన్?

  • చంద్రబాబు, యనమల, ముఖ్య అధికారుల భేటీ
  • దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది జాబితా సిద్ధం?
  • ఆర్టీఐ కమిషనర్లుగా ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు

ఏపీ  రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ల ఎంపిక విషయమై సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్య అధికారులు ఈరోజు భేటీ అయ్యారు. ఆర్టీఐ ప్రధాన కమిషనర్, ముగ్గురు కమిషనర్ల నియామకానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఆర్టీఐ కమిషనర్లుగా మాజీ ఐపీఎస్ బీవీ రమణకుమార్, మాజీ ఐఎఫ్ఎస్ రవికుమార్, అడ్వకేట్ జనార్దన్ పేర్లు దాదాపు ఖరారైనట్టేనని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, ప్రధాన కమిషనర్ ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన కమిషనర్ గా ఏకే జైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ ఎంపికను గవర్నర్ ఆమోదించాల్సి వుంది. ఇదిలా ఉండగా, ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై జరిగిన భేటీకి రావాలని కోరుతూ ప్రతిపక్ష నేత జగన్ కి మూడుసార్లు ఆహ్వానం పంపారు. అయినప్పటికీ ఈ సమావేశానికి జగన్ గైర్హాజరయ్యారు.

  • Loading...

More Telugu News