rajanikanth: నవ్వులు పూయించిన రజనీకాంత్ చమత్కారం!

  • రాజకీయ నేత, రజనీ స్నేహితుడు షణ్ముగన్ కు డాక్టరేట్
  •  షణ్ముగన్ హెయిర్ స్టైల్ బాగుంటుంది..
  • ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలిస్తే నేనూ కేర్ తీసుకునేవాడిని

తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత, ప్రముఖ నటుడు రజనీకాంత్ స్నేహితుడు   ఏసీ షణ్ముగన్ ను చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టరేట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలతో అక్కడి వాళ్లు కడుపుబ్బ నవ్వుకున్నారు. షణ్ముగన్ హెయిర్ స్టైల్ బాగుంటుందని, ఇందుకు ఆయన ఎలాంటి జాగ్రత్తలు పాటించారో తనకు తెలిసుంటే, తాను కూడా హెయిర్ కేర్ తీసుకునేవాడినని రజనీకాంత్ చమత్కరించడంతో నవ్వులు కురిశాయి. షణ్ముగన్ తో తనకు మంచి అనుబంధం ఉందని, ఎప్పుడూ నవ్వూతూ ఉండే ఆయన ముఖం కళకళలాడుతూ ఉంటుందంటూ రజనీ మెచ్చుకున్నారు.

rajanikanth
ac shanmugham
  • Loading...

More Telugu News