amarnath reddy: నెం.1గా నిలిచాం.. ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: అధికారులకు ఏపీ మంత్రి అమరనాథ్‌రెడ్డి సూచన

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపీకి అగ్రస్థానం
  • అధికారులు చేసిన కృషి ఎనలేనిది
  • సీఎం ఆలోచనలకు తగ్గట్లు పనిచేస్తూ పారిశ్రామిక ప్రగతి

సమష్టిగా పనిచేస్తూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తోన్న పరిశ్రమల శాఖ అధికారులు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమరనాథ్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కిన నేపథ్యంలో ఈరోజు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులు సదరు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపీకి అగ్రస్థానం దక్కడంలో అధికారులు చేసిన కృషి ఎనలేనిది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆలోచనలకు తగ్గట్లు పనిచేస్తూ పారిశ్రామిక ప్రగతికి సహకరించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పనిచేసి ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో అగ్రపథాన కొనసాగేందుకు కృషి చేయాలి' అని మంత్రి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు ఉన్నారు.

amarnath reddy
  • Loading...

More Telugu News