Virat Kohli: మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ!

  • ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి వన్డే
  • ఈ మ్యాచ్ తో 50 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ
  • 209వ వన్డే ఆడుతున్న విరాట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. ఈరోజు ఇంగ్లండ్ తో తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 50 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించినవారి క్లబ్ లో చేరాడు. టీమిండియాకు అత్యధికంగా ధోనీ 199 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్దీన్ (174), గంగూలీ (146), రాహుల్ ద్రావిడ్ (74), టెండూల్కర్ (73)లు ఉన్నారు. ఇప్పటి వరకు కోహ్లీ 209 వన్డేలు ఆడాడు. ఇందులో 35 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తమ్మీద 9588 పరుగులు చేశాడు. 

Virat Kohli
captain
team india
  • Loading...

More Telugu News