mahika sharma: సినీ సూపర్ స్టార్లు చాలా మంది స్వలింగ సంపర్కులే!: హీరోయిన్ మహికా శర్మ

  • చాలా మంది సూపర్ స్టార్లు స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడతారు
  • హంతకులకు, రేపిస్టులకు మన దేశంలో స్వేచ్ఛ ఉంది
  • హోమోసెక్సువల్స్ కు కూడా స్వేచ్ఛ కల్పించాలి

బాలీవుడ్ నటి మహికా శర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 377ను రద్దు చేసి, స్వలింగ సంపర్కానికి ఆమోదం పలకాలని జరుగుతున్న ప్రయత్నానికి మద్దతు పలికిన ఆమె... వినోదరంగంలో ఉన్న చాలా మంది పురుషులు హోమో సెక్సువల్సేనని తెలిపింది. ముంబైలో ఉన్న సూపర్ స్టార్లు, నటులు చాలా మంది స్వలింగ సంపర్కాన్ని ఇష్టపడతారని చెప్పింది.

మన దేశంలో హంతకులకు, అత్యాచారాలకు పాల్పడేవారికి ఎంతో స్వేచ్ఛ ఉందని... కానీ, హోమోసెక్సువల్స్ కు మాత్రం లేదని తెలిపింది. నిజానికి హోమోసెక్సువల్స్ చాలా మంచి వారని, వారిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. హోమో సెక్సువల్స్ కు స్వేచ్ఛ లభించేలా చేయాలని డిమాండ్ చేసింది. 

mahika sharma
homo sexual
bollywood
  • Loading...

More Telugu News