paripoornananda: పరిపూర్ణానందను బహిష్కరించిన మరో రెండు పోలీస్ కమిషనరేట్లు!

  • పరిపూర్ణానందను బహిష్కరించిన సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు
  • ఆరు నెలల పాటు నిషేధం
  • నోటీసులు ఇవ్వడానికి కాకినాడ వెళ్లిన పోలీసులు

ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులలో పేర్కొన్నారు. పరిపూర్ణానందకు ఈ నోటీసులు అందజేయడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు. మరోవైపు, సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై కూడా ఆరు నెలల నగర బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News